Raghu Rama Krishna Raju: సీఎం జగన్ బెయిల్ పొంది పదేళ్లు... కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన రఘురామ

Raghurama satires on CM Jagana completed his bail for ten years
  • సీఎం జగన్ బెయిల్ పై రఘురామ సెటైర్లు
  • ఇవాళ మా పార్టీ వాళ్లు సంబరాలు చేసుకునే రోజు అంటూ వ్యంగ్యం
  • రూ.43 వేల కోట్ల అవినీతి కేసులో బెయిల్ కొనసాగించడం జగన్ కే చెల్లిందని వ్యాఖ్యలు 
ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో బెయిల్ పొంది పదేళ్లయిన సందర్భంగా వైసీపీ రెబల్ ఎంపీ సెటైర్లు సంధించారు. కేక్ కట్ చేసి సీఎం జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. సెప్టెంబరు 23వ తేదీ మా పార్టీ వాళ్లు సంబరాలు చేసుకునే రోజు అని వ్యంగ్యం ప్రదర్శించారు. రూ.43 వేల కోట్ల అవినీతి కేసులో బెయిల్ పై రావడం, ఆ బెయిల్ ను విజయవంతంగా కొనసాగించడం జగన్ కే సాధ్యమైందని ఎద్దేవా చేశారు. కోర్టుకు హాజరు కావాల్సిన పనిలేదని ఆర్డర్ తెచ్చుకున్నారని, ఇంత ఘనత వహించిన జగన్ కు శుభాకాంక్షలు అంటూ రఘురామ వ్యాఖ్యానించారు.
Raghu Rama Krishna Raju
Jagan
Bail
YSRCP
Andhra Pradesh

More Telugu News