Ayyanna Patrudu: లోకేశ్ ను అరెస్ట్ చేస్తే నారా బ్రాహ్మణి పార్టీని నడిపిస్తారు: అయ్యన్న

Ayyanna said if police arrests Nara Lokesh then Nara Brahmani will lead the party
  • ఫైబర్ నెట్ కేసులో లోకేశ్ అరెస్ట్ కు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అయ్యన్న 
  • ప్రస్తుతం ఢిల్లీలో నారా లోకేశ్
  • తిరిగొస్తే ఎయిర్ పోర్టులోనే అరెస్ట్ చేయాలని చూస్తున్నారని వెల్లడి
  • ఊపిరి ఉన్నంత వరకు పార్టీని కాపాడుకుంటామని అయ్యన్న ప్రకటన 
టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. నారా లోకేశ్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారని, ఆయన ఏపీకి తిరిగి రాగానే ఎయిర్ పోర్టులోనే అరెస్ట్ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఏపీ ఫైబర్ నెట్ కేసులో లోకేశ్ అరెస్ట్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఒకవేళ లోకేశ్ ను అరెస్ట్ చేస్తే నారా బ్రాహ్మణి పార్టీని నడిపిస్తారని వెల్లడించారు. 

పార్టీని నాశనం చేయాలని అనేకమంది ప్రయత్నించారని, వాళ్ల వల్ల కాలేదని అన్నారు. ఊపిరి ఉన్నంత వరకు అలాంటి వారి ప్రయత్నాలు సాగనివ్వబోమని స్పష్టం చేశారు. రాష్ట్ర భవిష్యత్ కోసం తాము దేనికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 

రాష్ట్రంలో దోచుకోవడం, దాచుకోవడం తప్ప అభివృద్ధి లేదని తెలిపారు. ఏపీలో ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయని... రాష్ట్రం, పిల్లల భవిష్యత్ కోసం ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని అయ్యన్న పిలుపునిచ్చారు.
Ayyanna Patrudu
Nara Lokesh
Nara Brahmani
Arrest
AP Fiber Net
TDP
Andhra Pradesh

More Telugu News