చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు ఐటీ కంపెనీల సీఈవోలు కూడా నిరసన తెలుపుతున్నారు: దేవినేని ఉమ
- తప్పుడు పనులు చేసినవారు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక
- చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ధీమా
- ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైసీపీని బంగాళాఖాతంలో కలిపేయడం ఖాయమని వ్యాఖ్య
ఫైబర్ నెట్‌తో నెలకు రూ.35 కోట్ల చొప్పున 51 నెలల్లో రూ.1785 కోట్లు జగన్ వసూలు చేశారని ఆరోపించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా తమ పార్టీ నేత నారా లోకేశ్ రూ.25వేల కోట్లను ఖర్చు చేసి సిమెంట్ రోడ్లు వేశారన్నారు. పంచాయతీరాజ్ శాఖలో గణనీయమైన అభివృద్ధిని చేసి చూపించిన యువనేతపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగన్‌ను, వైసీపీని బంగాళాఖాతంలో కలిపేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.