ఇప్పుడు మా సంఖ్య 81.. త్వరలో 181 అవుతుంది: మహిళా రిజర్వేషన్ బిల్లుపై హేమమాలిని వ్యాఖ్య
- మహిళా రిజర్వేషన్ బిల్లుకు తన మద్దతు ప్రకటించిన బీజేపీ ఎంపీ హేమమాలిని
- బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టిన రోజు చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్య
- మహిళలు మరింత పెద్ద సంఖ్యలో ప్రజాజీవితంలోకి రావాలని పిలుపు
‘‘మహిళల కోసం తీసుకున్న ఈ గొప్ప నిర్ణయంతో సెప్టెంబర్ 19 చారిత్రాత్మక రోజుగా మారింది. నూతన పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఈ మొదటి బిల్లు త్వరలో సభ్యుల ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నాం. ప్రస్తుతం 81 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. ఈ బిల్లు తర్వాత మా సంఖ్య 181 అవుతుంది. దీంతో, మహిళా ప్రాతినిధ్యం పెరుగుతుంది. మహిళలకు ఆకాశమే హద్దు. కాబట్టి మరింత ఉత్సాహంతో ప్రజా జీవితంలో పని చేసేందుకు వారు ముందుకు రావాలి’’ అని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.