Nara Lokesh: టీడీపీ న్యాయ‌పోరాటానికి జాతీయ పార్టీల మ‌ద్దతు

Haryana Deputy CM BSP MPs extend support to TDP Nara lokesh
  • నారా లోకేశ్‌కు హర్యానా డిప్యూటీ సీఎం, బిఎస్పీ ఎంపీల పరామర్శ
  • టీడీపీ ధర్మపోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ
  • అంతిమంగా న్యాయమే గెలుస్తుందని వ్యాఖ్య
త‌ప్పుడు కేసులో అక్రమంగా అరెస్టు అయిన చంద్రబాబు ప‌క్షాన టీడీపీ చేస్తున్న న్యాయ‌పోరాటానికి త‌మ మ‌ద్దతు ఉంటుంద‌ని వివిధ జాతీయ పార్టీల నేత‌లు ప్రక‌టించారు. ఢిల్లీలో ఉన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేశ్‌ను బుధ‌వారం హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా, బిఎస్పీ ఎంపీలు కున్వార్ డ్యానిష్ ఆలీ, రితేష్ పాండే ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ అంతిమంగా న్యాయ‌మే గెలుస్తుంద‌ని వ్యాఖ్యానించారు. టీడీపీ చేస్తున్న ధ‌ర్మ పోరాటానికి త‌మ సంపూర్ణ మ‌ద్దతు ఉంటుంద‌న్నారు. ఈ సంద‌ర్భంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు సంబంధించి వాస్తవాలతో టీడీపీ రూపొందించిన బుక్‌లెట్‌ను జాతీయ పార్టీ నేత‌ల‌కి లోకేశ్ అంద‌జేశారు.
Nara Lokesh
Dushyant Chautala
BSP
Telugudesam
Chandrababu

More Telugu News