kalyan ram: ‘డెవిల్‌’ నుంచి ఫస్ట్ మెలోడీ.. ఆకట్టుకునేలా కల్యాణ్ రామ్, సంయుక్త రొమాన్స్

kalyam ram and samyuktha imoresses in First single from devil Maaye Chesi
  • అభిషేక్ నామా దర్శకత్వంలో వస్తున్న స్పై థ్రిల్లర్
  • ఐదు భాషల్లో ప్యాన్ ఇండియా స్థాయిలో రానున్న చిత్రం
  • నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు

నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న స్పై థ్రిల్లర్ సినిమా ‘డెవిల్’. మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త హీరోయిన్‌గా నటించింది. అభిషేక్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ బ్రిటీష్ ఏజెంట్‌ పాత్ర పోషించారు. ప్యాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి తొలి పాటను చిత్ర బృందం విడుదల చేసింది. 

'మాయే చేసి మెల్లగా.. మది దోచేసింది సిన్నగా.. చూపే చూసి సన్నగా’ అంటూ సాగిన ఈ మెలోడీ సాంగ్‌లో కల్యాణ్ రామ్, సంయుక్త వింటేజ్ లుక్‌లో కనిపించారు. ఇద్దరి మధ్య రొమాన్స్‌ ఆకట్టుకునేలా ఉంది. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటకు సత్య ఆర్.వి సాహిత్యం అందించారు. బృంద మాస్టర్ నృత్యం అందించింది. ఈ సినిమా  న‌వంబ‌ర్ 24న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. 

  • Loading...

More Telugu News