Idupulapaya IIIT: ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య

Idupulapaya IIIT Student Committed Suicide
  • సివిల్ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న గంగారాం
  • ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణం
  • ఆత్మహత్యకు కారణం తెలియాల్సి ఉందన్న పోలీసులు

ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వైఎస్సార్ జిల్లా లింగాల మండలం తేర్పాంపల్లె హరిజనవాడకు చెందిన నేర్జాంపల్లె గంగారాం (21) సివిల్ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. నిన్న తన హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. 

గది తలుపులు వేసి ఉండడంతో అనుమానించిన తోటి విద్యార్థులు కిటికీలోంచి చూసి షాకయ్యారు. ఫ్యాన్‌కు వేలాడుతున్న గంగారాంను చూసి అధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే ట్రిపుల్ ఐటీకి చేరుకుని విద్యార్థి మృతదేహాన్ని కిందికి దించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News