మోదీకి శుభాకాంక్షలు తెలిపిన జగన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మోదీకి శుభాకాంక్షలు తెలిపిన జగన్

Jagan birthday greetings to Modi
  • ఈరోజు ప్రధాని మోదీ పుట్టినరోజు
  • 73వ పుట్టినరోజును జరుపుకుంటున్న మోదీ
  • ట్విట్టర్ ద్వారా బర్త్  డే  విషెస్ తెలిపిన జగన్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు నేడు. ఈరోజు ఆయన 73వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీలకు అతీతంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా మోదీకి ట్విట్టర్ (ఎక్స్) ద్వారా గ్రీటింగ్స్ తెలిపారు. 73వ పుట్టినరోజు సందర్భంగా గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు.

మరోవైపు మోదీ పుట్టినరోజును దేశ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నాయి. సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. మోదీ పేరిట ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయిస్తున్నారు.
Advertisement
Jagan
YSRCP
Narendra Modi
BJP

More Telugu News