Congress: సోనియా బలిదేవత, రాహుల్​ ముద్దపప్పు అంటూ రేవంత్ రెడ్డి ఫొటోతో పోస్టర్ల కలకలం

Congress against sonia and rahul with revanth reddy pics
  • బంజారాహిల్స్‌లో వెలిసిన వాల్ పోస్టర్లు
  • సీడబ్ల్యూసీ భేటీ సమయంలో కాంగ్రెస్ వ్యతిరేక పోస్టర్లు
  • తాజ్‌కృష్ణలో కొనసాగుతున్న సీడబ్ల్యూసీ సమావేశాలు
హైదరాబాద్ లో రెండు రోజులుగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)సమావేశాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికల్లు జరగనున్న నేపథ్యంలో సీడబ్ల్యూసీ భేటీకి తెలంగాణ ఆతిథ్యం ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే సీడబ్ల్యూసీ సమావేశాల సమయంలో హైదరాబాద్‌లో పలు చోట్ల కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు, కటౌట్లు వెలవడం చర్చనీయాంశమైంది. 
తాజాగా బంజారాహిల్స్ లో మరోసారి రేవంత్ రెడ్డి ఫొటోతో వాల్ పోస్టర్లు కలకలం రేపాయి. సోనియాగాంధీని బలి దేవత, రాహుల్ గాంధీని ముద్దపప్పు అంటూ వారికి స్వాగతం పలుకుతున్నట్టు రేవంత్ రెడ్డి ఫొటోలతో ఉన్న పోస్టర్లు బంజారాహిల్స్‌ లో కనిపించాయి. రేవంత్, కాంగ్రెస్ అంటే గిట్టని వాళ్లు ఇలాంటి పోస్టర్లు రూపొందించి అతికించినట్టు తెలుస్తోంది.
Congress
Sonia Gandhi
Rahul Gandhi
Revanth Reddy
posters

More Telugu News