చంద్రబాబును టీడీపీ నేతలు కూడా పట్టించుకోవడం లేదు: కాకాణి గోవర్ధన్ రెడ్డి
చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ ను టీడీపీ తట్టుకోలేకపోతోందన్న కాకాణి
- ప్రభుత్వాన్ని, జడ్జిలను, న్యాయవాదులను విమర్శిస్తున్నారని మండిపాటు
- చంద్రబాబుకు ఎప్పుడో 15 ఏళ్ల జైలు శిక్ష పడాల్సిందని వ్యాఖ్య
ఏదో జరిగిందని చెప్పేందుకు నారా లోకేశ్ ఢిల్లీకి వెళ్లాడని... అక్కడకు వెళ్లి ఏమీ చెప్పలేకపోయాడని కాకాణి అన్నారు. చంద్రబాబును జైలు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ఏ లాయర్లను పట్టుకుంటే బాగుంటుందనే విషయంపై లోకేశ్ చర్చలు జరుపుతున్నారని విమర్శించారు. లోకేశ్ ను కూడా అరెస్ట్ చేస్తారని ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని... ఎందుకంటే లోకేశ్ కూడా అవినీతికి పాల్పడ్డాడనే విషయం వారికి తెలుసని చెప్పారు. చంద్రబాబు చేసిన అవినీతికి 15 ఏళ్ల జైలు శిక్ష ఎప్పుడో పడాల్సిందని అన్నారు.