ఊర్వశీ రౌతేలా మరో ఐటమ్ సాంగ్.. ఈసారి రామ్‌తో ‘కల్ట్ మామా’ స్టెప్పులు
- పోతినేని రామ్, బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న ‘స్కంద’ చిత్రం
- రేపు విడుదల కానున్న ‘కల్ట్ మామా’ అనే ఐటమ్ సాంగ్
- ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా
ఇప్పటికే ఈ చిత్రం నుండి మూడు పాటలను విడుదల చేసిన చిత్ర బృందం ‘కల్ట్ మామా’ అంటూ సాగే నాలుగో పాటను ఈ నెల 18న విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. సినిమాలో ఇదొక స్పెషల్ సాంగ్. ఈ మాస్ పాటకు తమన్ తనదైన శైలిలో బాణీలు అందించగా రామ్, ఊర్వశీ హుషారుగా స్టెప్పులు వేసినట్టు తెలుస్తోంది. కాగా, ఈ చిత్రంలో శ్రీలీల, సయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు. శ్రీకాంత్, గౌతమి, ప్రిన్స్ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఈ నెల 28న విడుదల కానుంది.