నాటు నాటు పాటకు డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్ల డ్యాన్స్.. వీడియో ఇదిగో!

WWE Superstars Dance To RRRs Naatu Naatu In The Ring
  • హైదరాబాద్ సూపర్ స్టార్ స్పెక్టాకిల్ వేదికపై డ్యాన్స్
  • రెజ్లర్ల డ్యాన్స్ చూసి అభిమానుల కేరింతలు
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్ టైన్ మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) పోటీలలో అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. రింగ్ లో ప్రత్యర్థిని ఎలా పడగొట్టాలని ఆలోచిస్తూ, పిడిగుద్దులతో విరుచుకుపడే రెజ్లర్లు అదే రింగ్ లో సరదాగా చిందేశారు. మ్యాచ్ ముగిసిన తర్వాత నలుగురు సూపర్ స్టార్లు ఆస్కార్ అందుకున్న పాటకు కాలుకదిపారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు అదిరిపోయే స్టెప్పులేసి అభిమానులను అలరించారు. తమ అభిమాన ఫైటర్లు అందరూ ఒకరి భుజాలపై మరొకరు చేతులు వేసి డ్యాన్స్ చేయడం చూసి అభిమానులంతా జోష్ లో మునిగిపోయారు.

హైదరాబాద్ వేదికగా జరుగుతున్న డబ్ల్యూడబ్ల్యూఈ పోటీలలో ఈ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. సూపర్ స్టార్ స్పెక్టాకిల్ తొలి మ్యాచ్ లో భారత స్టార్ రెజ్లర్లు వీర్ మహాన్, జిందర్ మహాల్, సంగా పాల్గొన్నారు. వీరితో వెటరన్ స్టార్లు కెవిన్ ఓవెన్స్, శామీ జేన్, డ్రూ మెకింటైర్ పోటీపడ్డారు. నలుగురి మధ్య జరగాల్సిన ఈ మ్యాచ్.. హైడ్రామాతో ఆరుగురి మధ్య పోటీగా మారింది. ఇందులో డ్రూ, కెవిన్, ఓవెన్స్ జోడీ గెలుపొందింది. మ్యాచ్ తర్వాత ఆరుగురు రెజ్లర్లు నాటు నాటు పాటకు డ్యాన్స్ చేయడంతో అభిమానులు కేకలతో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Go Back to Shorts
WWE
RRR
Naatu Naatu
Dance

More Telugu News