Chandrababu: రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుకు ప్రత్యేక వైద్య బృందం ఏర్పాటు

Special medical team for Chandrababu in Jail
  • 10 మందితో కూడిన మెడికల్ టీమ్ ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం
  • వీరిలో ఐదుగురు డాక్టర్లు, ముగ్గురు వైద్య సిబ్బంది, ఇద్దరు డ్రైవర్లు
  • అత్యవసర మందులు, ఓ పాజిటివ్ బ్లడ్ అనునిత్యం అందుబాటులో ఉండాలని ఆదేశం
రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసింది. మొత్తం 10 మందితో కూడిన మెడికల్ టీమ్ ను నియమించింది. వీరిలో ఐదుగురు వైద్యులు, ముగ్గురు వైద్య సిబ్బంది, ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. ఐదుగురు వైద్యుల్లో ముగ్గురు రాజమండ్రిలోని ప్రభుత్వ ఆసుపత్రికి చెందినవారని తెలుస్తోంది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నియంత్రణలో వీరు ఉంటారు. మరో ఇద్దరు డాక్టర్లు జిల్లా వైద్య సేవల సమన్వయ అధికారి పరిధిలో పని చేస్తారు. మరోవైపు చంద్రబాబుకు అవసరమైన అన్ని అత్యవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని వైద్య శాఖ ఆదేశించింది. రెండు యూనిట్ల ఓ పాజిటివ్ రక్తం అనునిత్యం అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.
Chandrababu
Jail
Mediacal Team

More Telugu News