Bollywood celebs: ఈడీ నిఘాలో 17 మంది బాలీవుడ్ సెలబ్రిటీలు

17 Bollywood celebs on ED radar for attending Rs 200 crore Dubai wedding

  • దుబాయిలో మహాదేవ్ గ్యాంబ్లింగ్ యాప్ యజమాని చంద్రశేఖర్ వివాహం
  • రూ.200 కోట్ల ఖర్చు.. బాలీవుడ్ సెలబ్రిటీలకు భారీగా చెల్లింపులు
  • విచారణకు రావాలంటూ సమన్లు జారీ చేస్తున్న ఈడీ

మహాదేవ్ గ్యాంబ్లింగ్ యాప్ యజమాని సౌరభ్ చంద్రశేఖర్ వివాహం ఈ ఏడాది ఫిబ్రవరిలో దుబాయిలో జరిగింది. తన వివాహం కోసం సౌరభ్ రూ.200 కోట్లు ఖర్చు చేసినట్టు ఈడీ అధికారులు తెలుసుకున్నారు. పెళ్లిలో అంత ఖర్చు దేనికి పెట్టారయ్యా? అంటే.. చంద్రశేఖర్ వివాహ ఖర్చులో అధిక భాగం హాజరైన బాలీవుడ్ సెలబ్రిటీల చెల్లింపుల కోసమేనని తెలిసింది. దీంతో 17 మంది బాలీవుడ్ సెలబ్రిటీలకు విచారణకు రావాలంటూ ఈడీ సమన్లు జారీ చేస్తున్నట్టు తెలిసింది. టైగర్ ష్రాఫ్, సన్నీ లియోన్, గాయని నేహా కక్కర్ తదితరులు వివాహానికి హాజరైన వారిలో ఉన్నారు. చంద్రశేఖర్ తన వివాహం కోసం ముంబై నుంచి బాలీవుడ్ సెలబ్రిటీలతోపాటు వెడ్డింగ్ ప్లానర్లు, డెకరేటర్లను రప్పించినట్టు తెలిసింది. 

సౌరభ్ కు వ్యతిరేకంగా రూ.5,000 కోట్ల మనీలాండరింగ్ కేసును ఈడీ దర్యాప్తు చేస్తోంది. చంద్రశేఖర్, అతడి భాగస్వామి రవి ఉప్పల్ దుబాయి నుంచి ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ యాప్ నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ చత్తీస్ గఢ్ రాష్ట్రానికి చెందిన వారు. వీరి కోసం ఈడీ వేటాడుతోంది. ఈడీ వర్గాల సమాచారం ప్రకారం చంద్రశేఖర్ 2022లోనూ దుబాయిలో పెద్ద పార్టీ ఒకటి నిర్వహించాడు. ఆ సమయంలో బాలీవుడ్ సెలబ్రిటీలకు రూ.40 కోట్లు చెల్లించాడు. చంద్రశేఖర్ గ్యాంబ్లింగ్ కార్యకలాపాలపై గత డిసెంబర్ నుంచి ఈడీ దర్యాప్తు నిర్వహిస్తుండగా, బాలీవుడ్ తో లింకుల వ్యవహారం తాజాగానే వెలుగు చూసినట్టు తెలిసింది.

  • Loading...

More Telugu News