వారు లేకపోవడం వల్లే ఓడిపోయారా?.. రోహిత్ కు మీడియా ప్రశ్న
- బంగ్లాదేశ్ చేతిలో చిత్తు అయిన టీమిండియా
- కీలక ఆటగాళ్లను పక్కన పెట్టి బెంచ్ పై ఉన్న వారికి అవకాశం
- ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన యువ ప్లేయర్లు
కీలక ఆటగాళ్లు లేకపోవడం వల్లే భారత్ ఓటమి పాలైందా? అన్న ప్రశ్న మ్యాచ్ అనంతరం మీడియా నుంచి రోహిత్ కు ఎదురైంది. మార్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందని మీడియా ప్రశ్నించింది. ‘‘భవిష్యత్ అంచనాలను దృష్టిలో పెట్టుకుని ఆటగాళ్లు తమ ప్రతిభ చూపించేందుకు కొంత సమయం ఇవ్వాలని అనుకున్నాం. ప్రపంచకప్ ను దృష్టిలో పెట్టుకుని ఆడే అవకాశం కల్పించాలని అనుకున్నాం’’ అని రోహిత్ శర్మ తెలిపాడు. కానీ, వచ్చిన అవకాశాన్ని ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, ప్రసిద్ధ కృష్ణ, సూర్యకుమార్ యాదవ్ సద్వినియోగం చేసుకోలేకపోయారు. మొత్తం మీద కీలక మార్పులతో భారత్ ఓటమి పాలు కావడంపై అభిమానులు మండిపడుతున్నారు.