ప్రధాని నరేంద్రమోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రధాని నరేంద్రమోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ

Telangana CM KCR letter to PM Modi
  • ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టాలని లేఖ
  • 2014లోనే బీసీ రిజర్వేషన్‌కు తెలంగాణ తీర్మానం చేసిందని వెల్లడి
  • ఈ రెండు బిల్లులు తీసుకువచ్చేలా పార్లమెంట్‌లో ఒత్తిడి చేయాలని ఎంపీలకు సూచన
ప్రధాని నరేంద్రమోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లేఖ రాశారు. ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు బీసీ రిజర్వేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టాలని ఆ లేఖలో కోరారు. 2014లోనే తెలంగాణ అసెంబ్లీ బీసీ రిజర్వేషన్‌కు తీర్మానం చేసినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి బీసీలపట్ల చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. మహిళా రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్‌కు బీఆర్ఎస్ కట్టుబడి ఉందన్నారు.

దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉన్న బీసీలకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తోన్న పథకాలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. రాజకీయ అధికారంలో బీసీలను మరింత భాగస్వామ్యం చేయాల్సి ఉందన్నారు. వచ్చే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు, బీసీ రిజర్వేషన్ బిల్లును తీసుకు వచ్చేలా ఒత్తిడి తేవాలని పార్టీ ఎంపీలకు కేసీఆర్ సూచన చేశారు. ఈ మేరకు బీసీ రిజర్వేషన్ బిల్లుపై తీర్మానం పాస్ చేసి, ఇందుకు సంబంధించిన ప్రతిని కూడా ప్రధాని మోదీకి లేఖతో పాటు పంపించారు. 
Advertisement
KCR
Narendra Modi
BRS
BJP
Parliament

More Telugu News