ఆఫ్ఘన్ క్రికెటర్ తో రణబీర్ కపూర్ దంపతుల భేటీ
- న్యూయార్క్ లో కలుసుకున్న దృశ్యం
- ఫొటో షేర్ చేసిన రషీద్ ఖాన్
- కొన్ని వారాలుగా విదేశీ పర్యటనలో ఉన్న రణబీర్ దంపతులు
రషీద్ ఖాన్ మధ్యలో ఉండగా, కుడి వైపున అలియా భట్, ఎడమవైపు రణబీర్ కపూర్ నించున్నారు. రషీద్ ఖాన్ భుజంపై రణబీర్ చేయి వేసి, మరో చేయి చూపుడు వేలును రషీద్ వైపు చూపిస్తున్నట్టు ఫొటోలో ఉంది. ఇందులో రషీద్ ఖాన్, అలియా భట్ ఇద్దరూ నల్లటి టీ షర్టుల్లో ఉంటే, రణబీర్ గ్రే కలర్ టీ షర్ట్ తో కనిపిస్తున్నాడు. రణబీర్ కపూర్ దంపతులు న్యూయార్క్ పర్యటనను పూర్తి స్థాయిలో ఆస్వాదిస్తున్నారు. తమ పర్యటనకు సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలను అలియా భట్ తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. రషీద్ ఖాన్ తో అలియా భట్, రణబీర్ భేటీ ఫొటో పట్ల అభిమానులు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.