Nayanthara: వ్యాపార రంగంలోకి లేడీ సూపర్ స్టార్ నయనతార

Nayanthara launches new skincare brand 9skin
  • చర్మ సంరక్షణ ఉత్పత్తి తీసుకొస్తున్నట్టు వెల్లడి
  • భర్తతో కలిసి ‘9స్కిన్’ పేరిట బ్రాండ్ ప్రకటన
  • జవాన్ చిత్రంతో భారీ విజయం అందుకున్న నయన్
దక్షిణాదిలో అగ్ర హీరోయిన్ గా వెలుగొంతున్న లేడీ సూపర్ స్టార్ నయనతార ‘జవాన్’ చిత్రంతో బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టింది. షారుక్ ఖాన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఘన విజయం సాధించగా.. ఆమెకు మంచి పేరు లభించింది. ఓవైపు నటిగా చాలా బిజీగా ఉన్న నయన్ ఇప్పుడు భర్త, ప్రముఖ దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో కలిసి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. చర్మ సంరక్షణ ఉత్పత్తుల బిజినెస్ ను ప్రారంభించింది. తమ ఉత్పత్తికి ‘9స్కిన్’ అని పేరు పెట్టినట్టు సోషల్ మీడియా ద్వారా నయన్ వెల్లడించింది. 9స్కిన్ పేరుతో తన స్కిన్‌కేర్ బ్రాండ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది.

ఈ నెల 29 నుంచి ఉత్పత్తులను విక్రయించనున్నట్టు ఆమె ప్రకటించిన ప్రోమోను షేర్ చేసింది. నయన్ ఇది వరకు చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ రెనిటా రాజన్‌తో కలిసి లిప్‌బాల్మ్ కంపెనీని ప్రారంభించింది. కాగా, సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది తారలు ఇప్పటికే వ్యాపార రంగంలోకి వచ్చారు. రకుల్ ప్రీత్, సమంత, కత్రినా కైఫ్, శిల్పా శెట్టి వివిధ వ్యాపారాల్లో రాణిస్తున్నారు.
Nayanthara
vihnesh shivan
bussiness
9skin brand

More Telugu News