Pawan Kalyan: నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలను పరామర్శించిన పవన్ కల్యాణ్

Pawan Kalyam meets Nara Bhuvaneswari and Brahmini
  • రాజమండ్రి సెంట్రల్ జైలుకు సమీపంలోని క్యాంప్ లో చంద్రబాబు కుటుంబం
  • అక్కడకు వెళ్లి భువనేశ్వరి, బ్రాహ్మణిలను కలిసిన పవన్
  • అంతకు ముందు చంద్రబాబును కలిసిన పవన్

టీడీపీ అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణిలను జనసేనాని పవన్ కల్యాణ్ పరామర్శించారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు కొంత దూరంలో చంద్రబాబు కుటుంబం బస చేస్తున్న క్యాంప్ కు ఆయన వెళ్లారు. వారితో కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా వారితో పాటు బాలకృష్ణ, నారా లోకేశ్ కూడా ఉన్నారు. అంతకు ముందు జైల్లో ఉన్న చంద్రబాబును పవన్, బాలయ్య, లోకేశ్ కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్ టీడీపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నామని స్పష్టమైన ప్రకటన చేశారు.

  • Loading...

More Telugu News