nandamuri ramakrishna: చంద్రబాబు అరెస్ట్‌ను ప్రముఖులందరూ ఖండిస్తున్నారు: నందమూరి రామకృష్ణ

Nandamuri Ramakrishna hopes Chandrababu will become cm again
  • తాడికొండలో టీడీపీ నేతల రిలే నిరాహార దీక్షలకు రామకృష్ణ సంఘీభావం
  • ఎలాంటి ఆధారాలు లేకున్నా అరెస్ట్ చేశారని ఆవేదన
  • జగన్ స్క్రిప్ట్ ప్రకారమే చంద్రబాబును రాక్షసంగా అరెస్ట్ చేశారని వ్యాఖ్య
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడి అరెస్ట్‌ను దేశంలోని ప్రముఖులు అందరూ ఖండిస్తున్నారని ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ అన్నారు. గుంటూరు జిల్లా తాడికొండలో టీడీపీ నేతల రిలే నిరాహార దీక్షలకు ఆయన సంఘీభావం తెలిపి మాట్లాడారు. చంద్రబాబును ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ అరెస్ట్ చేశారని ఆరోపించారు. టీడీపీ అధినేతకు మద్దతుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి పోరాటం చేయాలన్నారు.

అంతా ముఖ్యమంత్రి జగన్ స్క్రిప్ట్ ప్రకారమే సాగుతోందని, అందుకే చంద్రబాబును రాక్షసంగా, అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆయన సీఎం అయ్యాక ఆంధ్రప్రదేశ్‌ను ముందు వరుసలో ఉంచుతారన్నారు.
nandamuri ramakrishna
Chandrababu
Andhra Pradesh
YS Jagan

More Telugu News