Kumaraswamy: నారా లోకేశ్ కు ఫోన్ చేసి పరామర్శించిన కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి

Karnataka former CM Kumara Swamy talks to Nara Lokesh
  • స్కిల్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్... రిమాండ్ విధింపు
  • లోకేశ్ కు పెరుగుతున్న మద్దతు
  • చంద్రబాబును తప్పుడు కేసులో అరెస్ట్ చేశారన్న కుమారస్వామి
  • అంతిమంగా న్యాయమే గెలుస్తుందని లోకేశ్ కు ధైర్యం చెప్పిన కన్నడ నేత
చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో టీడీపీకి, నారా లోకేశ్ కు మద్దతుగా నిలుస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా, నారా లోకేశ్ కు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఫోన్ చేసి పరామర్శించారు. ఇలాంటి కష్ట సమయాల్లో ధైర్యంగా ఉండాలని సూచించారు. తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. కక్ష సాధింపు రాజకీయాల్లో భాగంగానే చంద్రబాబు అరెస్టు చోటుచేసుకుందని భావిస్తున్నట్టు కుమారస్వామి తెలిపారు. చంద్రబాబును తప్పుడు కేసులో అరెస్టు చేశారన్నారు. అంతిమంగా న్యాయమే గెలుస్తుందని లోకేశ్ కు ధైర్యం చెప్పారు.
Kumaraswamy
Nara Lokesh
Chandrababu
Arrest
Karnataka
Andhra Pradesh

More Telugu News