Nara Lokesh: వైసీపీ ప్రభుత్వం అప్రకటిత యుద్ధం చేస్తోంది: నారా లోకేశ్

Nara Lokesh says YS Jagan government false cases on TDP cadre
  • మనం కాపాడిన ధర్మమే మనల్ని కాపాడుతుందన్న లోకేశ్
  • అంతిమంగా సత్యం గెలుస్తుందని వ్యాఖ్య
  • చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ చేపట్టిన దీక్షలపై జగన్ సర్కార్ విరుచుకుపడుతోందని ఆరోపణ
మనం కాపాడిన ధర్మమే మనల్ని కాపాడుతుందని, అంతిమంగా సత్యం గెలుస్తుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... సత్యాన్ని చంపేసి, ధర్మాన్ని చెరబట్టామని వైసీపీ కాలకేయులు సంబరాలు చేసుకుంటున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ చేపట్టిన సామూహిక నిరాహార దీక్షలపై సైకో జగన్ సర్కార్ విరుచుకుపడిందని మండిపడ్డారు.

శ్రీకాళహస్తిలో శాంతియుతంగా దీక్ష చేపట్టిన వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. అలాగే కుప్పం తదితర ప్రాంతాల్లోను టీడీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించారన్నారు. చంద్రబాబు అరెస్ట్‌కు సంఘీభావం ప్రకటిస్తున్న వారిపై ఈ ప్రభుత్వం అప్రకటిత యుద్ధం చేస్తోందని ఆరోపించారు. ఈ కేసు నుంచి చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు. టీడీపీ శ్రేణులు ఆవేశానికి లోను కావొద్దని, టీడీపీ మీ వెన్నంటే ఉందన్నారు.
Nara Lokesh
Chandrababu
YS Jagan
Andhra Pradesh

More Telugu News