Mamata Banerjee: చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

if there is some mistake conduct investigation mamata on chandrababu arrest
  • చంద్రబాబు అరెస్ట్ కక్ష సాధింపులా ఉందన్న మమతా బెనర్జీ
  • ఏదైనా తప్పు జరిగితే విచారణ జరిపించాలని సూచన
  • కక్షపూరితంగా ప్రవర్తించకూడదన్న మమతా బెనర్జీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్ట్‌పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ స్పందించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు అరెస్ట్ కక్ష సాధింపులా ఉందన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరు సరికాదన్నారు. టీడీపీ హయాంలో ఏదైనా తప్పు జరిగితే మాట్లాడాలని, పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలన్నారు. కానీ కక్షపూరితంగా ప్రవర్తించడం సరికాదన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రెండు రోజుల క్రితం చంద్రబాబును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News