Chandrababu: చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్ రద్దు

Chandrababu Naidu Mulakath with family cancled
  • ఈ రోజు మూడు గంటలకు చంద్రబాబుతో కుటుంబ సభ్యుల భేటీకి ఏర్పాట్లు
  • భువనేశ్వరి, బ్రాహ్మణి రాలేని పరిస్థితుల్లో రేపటికి వాయిదాపడిన ములాఖత్
  • రిమాండ్ తర్వాత పరిణామాలపై ముఖ్య నేతలతో లోకేశ్ చర్చలు
రాజమండ్రి కేంద్రకారాగారంలో ఉన్న నారా చంద్రబాబునాయుడుతో కుటుంబ సభ్యుల ములాఖత్ రద్దయింది. తొలుత ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, నారా భువనేశ్వరి, బ్రాహ్మణి టీడీపీ అధినేతను కలుస్తారని భావించారు. ఈ మేరకు జైలు అధికారులకు కూడా సమాచారం వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

అయితే భువనేశ్వరి, బ్రాహ్మణి ఈ రోజు 3 గంటల వరకు రాలేని పరిస్థితుల్లో కుటుంబ సభ్యుల ములాఖత్ రేపు మధ్యాహ్నానికి వాయిదా పడిందని తెలుస్తోంది. కాగా నారా లోకేశ్ తన బస్సులో ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. రిమాండ్ తర్వాత పరిణామాలపై ఆయన నేతలతో చర్చిస్తున్నారు.
Chandrababu
Nara Lokesh
Nara Bhuvaneswari
brahmani

More Telugu News