Panchumarthi Anuradha: ఒకప్పుడు చెక్ బౌన్స్ అయిన రోజా.. నేడు వందల కోట్లు ఎలా సంపాదించింది?: పంచుమర్తి అనురాధ

how once cheque bounced Roja earned hundreds of crores asks Panchumarthi Anuradha
  • చంద్రబాబు రిమాండ్ ను సెలెబ్రేట్ చేసుకున్న రోజా
  • అరచేతి మందం మేకప్ వేసుకుని బాణసంచా కాల్చిందని అనురాధ ఎద్దేవా
  • నగరి ప్రజలు రోజా గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారని వ్యాఖ్య
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన తర్వాత ఏపీ మంత్రి రోజా సంబరాలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి సెలెబ్రేట్ చేసుకున్నారు. మరోవైపు రోజాపై టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తీవ్ర విమర్శలు గుప్పించారు. స్కిల్ అంటే ఏమిటో తెలియని రోజా స్కిల్ డెవలప్ మెంట్ గురించి నోటికొచ్చినట్టు మాట్టాడుతోందని మండిపడ్డారు.

చంద్రబాబు అరెస్ట్ అయితే అరచేతి మందం మేకప్ వేసుకుని బాణసంచా కాలుస్తావా? అని దుయ్యబట్టారు. ఒకప్పుడు చెక్ బౌన్స్ అయిన రోజా... ఇప్పుడు వందల కోట్లకు అధిపతి ఎలా అయిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రోజా గురించి నగరి నియోజకవర్గం ప్రజలే రకరకాలుగా మాట్లాడుకుంటున్నారని అన్నారు. సంబరాలు జరుపుకుంటున్న వైసీపీ దుర్మార్గులకు 144 సెక్షన్ వర్తించదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని... ఆయన మళ్లీ సీఎం కావడం ఖాయమని చెప్పారు.
Panchumarthi Anuradha
Chandrababu
Telugudesam
roja
ysr

More Telugu News