13 ఏళ్ల తర్వాత మాజీ భార్య దర్శకత్వం... నిర్మాతగా బాలీవుడ్ బడా స్టార్
- కిరణ్ రావు దర్శకత్వంలో వస్తున్న హిందీ చిత్రం లాపతా లేడీస్
- నిర్మాతగా వ్యవహరిస్తున్న ఆమిర్ ఖాన్
- పెళ్లి కూతుళ్ల మిస్సింగ్ నేపథ్యంలో కామెడీ సినిమా
కొత్తగా పెళ్లయిన ఓ జంట ట్రైన్‌లో ప్రయాణం చేస్తుండగా, భార్య కనిపించకుండా పోతుంది. పెళ్లి కూతురు మిస్సింగ్ అంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తాడు.. ఫొటోలో ఆమె ముఖం పెళ్లి ముసుగుతో కప్పేసి ఉంటుంది. మరోవైపు అదే ట్రైన్‌లో మరో పెళ్లికూతురు కనిపించడం లేదంటూ మరో ఫిర్యాదు వస్తుంది. ఇలా పెళ్లి కూతుళ్ల మిస్సింగ్ చుట్టూ జరిగే కామెడీతో ఈ చిత్రం ఉంటున్నట్టు టీజర్ చూస్తే అర్థం అవుతోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 5న విడుదల కానుంది.