Hyderabad: హైదరాబాద్‌లో డబ్ల్యూడబ్ల్యూఈ.. భారతీయుల అభిమానం చూసి మురిసిన జాన్ సీన

WWE spectacle fight organized in hyderabad john sena surprised by hyderabadi youth affection
  • శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ స్పెక్టకల్ ఫైట్
  • షోలో జాన్ సీన సహా పలువురు స్టార్ ఫైటర్లు పాల్గొన్న వైనం
  • ఇక్కడి యువత అభిమానంతో ఉక్కిరిబిక్కిరైన జాన్ సీన
  • జాన్ సీనను కలిసి ముచ్చటించిన నటుడు కార్తి
హైదరాబాద్ వేదికగా శుక్రవారం జరిగిన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌స్టార్ స్పెక్టకల్ ఫైట్ నగరవాసులతో పాటూ యావత్ భారత ఫైటింగ్ అభిమానులను అలరించింది. స్టార్ ఫైటర్ జాన్ సీన సహా పలువురు డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్లు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత యువత తనపై కురిపించిన అభిమానానికి జాన్ సీన అచ్చెరవొందారు. 

‘‘భారత యువత నన్నెంతగానో అభిమానించడం ఆనందంగా ఉంది. హైదరాబాద్‌కు రావడం ఇదేతొలిసారి. పోటీల్లో ప్రతిభ కనబరిచే వారికి భవిష్యత్తు ఉంటుంది’’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ నటుడు కార్తి జాన్ సీనను కలిసి ముచ్చటించాడు. ఆయనతో ఓ ఫొటో దిగాడు.
Hyderabad
WWE
John Cena
Spectacle fight

More Telugu News