Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్

TDP Leader Chandrababu May Be Arrest Today
  • స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు
  • నంద్యాలలో ఆయన బస చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు
  •  మరికాసేపట్లో విజయవాడకు తరలింపు
స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాలలో ఆయన బస చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న పోలీసులు ఈ ఉదయం 6 గంటల సమయంలో అరెస్ట్ చేశారు. సీఆర్పీసీ సెక్షన్ 50(1) కింద ఆయనకు నోటీసు ఇచ్చి అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. 

బ్రేక్ ఫాస్ట్ అనంతరం చంద్రబాబును విజయవాడకు తరలించేందుకు సీబీఐ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అంతకుముందు చంద్రబాబును అరెస్ట్ చేయబోతున్నారన్న వార్తతో నంద్యాలలో కలకలం రేగింది. టీడీపీ నేతలు కాలువ శ్రీనివాసులు, భూమా బ్రహ్మానందరెడ్డి, భూమా అఖిలప్రియ, జగత్ విఖ్యాత్‌రెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి తదితర నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
Chandrababu
Telugudesam
Nandyala

More Telugu News