భారత్ పర్యటన నాకు చాలా ప్రత్యేకం.. నన్ను ఆప్యాయంగానే అలా పిలుస్తారు: రిషి సునక్
- తనను భారత దేశ అల్లుడిగా పిలుస్తారన్న రిషి సునక్
- రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై విమర్శలు
- పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం, అంతర్జాతీయ సంబంధాల నిర్మాణం వంటి స్పష్టమైన లక్ష్యాలతో తాను భారత పర్యటనకు వెళ్తున్నట్లు చెప్పారు. మరోవైపు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై విమర్శలు గుప్పించారు. పుతిన్ మరోసారి ముఖం చాటేశారన్నారు. ఆయన స్వయంగా తనకు తానే దౌత్య బహిష్కరణ రూపశిల్పిగా మలుచుకున్నారన్నారు. అధ్యక్ష భవనంలో ఉంటూ విమర్శలు పట్టించుకోకుండా, వాస్తవికతకు దూరంగా ఆయన ఉంటున్నారన్నారు. ఉక్రెయిన్ పై రష్యా ఆక్రమణను మానవ హక్కులు, ప్రజాస్వామ్యంపై దాడిగా ఆయన అభివర్ణించారు.