Anushka Shetty: అనుష్క మూవీ తొలి రోజు కలెక్షన్ రూ.4 కోట్లు

Miss Shetty Mr Polishetty box office collection day 1 Anushka Shetty and Naveen Polishettys film opens at 4 crore
  • తమిళంలో ఆదరణ అంతంతే
  • తెలుగులో థియేటర్లకు ప్రేక్షకుల రాక ఫర్వాలేదు
  • అమెరికాలో తొలిరోజు రూ.2.5 కోట్ల వసూళ్లు
అనుష్క, నవీన్ పోలిశెట్టి నటించిన ‘మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి’ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు మొత్తం మీద రూ.4 కోట్ల ఆదాయం వచ్చినట్టు శాక్ నిల్క్ అనే వెబ్ సైట్ తెలిపింది. తెలుగు, తమిళ భాషల్లో దీన్ని విడుదల చేశారు. తెలుగులో థియేటర్లలో తెలుగు ప్రేక్షకుల ఆక్యుపెన్సీ 39 శాతంగా ఉంటే, తమిళంలో 18.16 శాతంగా ఉన్నట్టు వెల్లడించింది. అంటే తెలుగుతో పోలిస్తే తమిళ ప్రజల్లో దీనికి ఆదరణ సగమే ఉన్నట్టు తెలుస్తోంది.

అమెరికాలో తొలి రోజు రూ.2.5 కోట్ల ఆదాయం వసూలైనట్టు స్టూడియో ఫ్లిక్స్ గణాంకాలు చెబుతున్నాయి. షారూక్ ఖాన్ నటించిన జవాన్ కూడా నిన్ననే విడుదల కావడం తెలిసిందే. జవాన్ మొదటి రోజే రూ.75 కోట్లు వసూలు చేసింది. అతిపెద్ద సినిమా విడుదల రోజే మిస్ శెట్టిని తీసుకురావడం కూడా కొంత ప్రభావం పడేలా చేసింది. పి.మహేశ్ బాబు దర్శకత్వంలో వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాకు స్పందన మిశ్రమంగా ఉందని ప్రేక్షకుల అభిప్రాయాలను పరిశీలిస్తే తెలుస్తోంది.
Anushka Shetty
box office
collection
1st day
Miss Shetty Mr Polishetty

More Telugu News