Joe Root: అతడే వరల్డ్ కప్ టాప్ స్కోరర్: జో రూట్

Joe Root says Bairstow will be top run getter in ICC World Cup
  • అక్టోబరు 5 నుంచి భారత్ లో వన్డే వరల్డ్ కప్
  • ఆయా జట్ల బలాబలాలు, ఆటగాళ్లపై కొనసాగుతున్న విశ్లేషణలు
  • తమ జట్టుకు చెందిన ఆటగాళ్లే టాప్ అంటున్న ఇంగ్లండ్ స్టార్ జో రూట్

భారత్ లో అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. మరి కొన్నిరోజుల్లో మెగా ఈవెంట్ కు తెరలేవనున్న నేపథ్యంలో, వివిధ జట్ల బలాబలాలు, కీలకంగా మారే ఆటగాళ్లపై చర్చ జరుగుతోంది. ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ కూడా వరల్డ్ కప్ పై స్పందించాడు. ఈసారి టోర్నీలో టాప్ స్కోరర్ గా నిలిచే ఆటగాడు ఎవరో తన మనసులో మాట బయటపెట్టాడు. 

భారత్ లో జరిగే వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ జానీ బెయిర్ స్టో పరుగుల వరద పారిస్తాడని రూట్ జోస్యం చెప్పాడు. వన్డేలు, టీ20లకు వచ్చేసరికి బెయిర్ స్టో ఆటతీరు మారిపోతుందని, టాపార్డర్ లో అతడే కీలకమని అభిప్రాయపడ్డాడు. వైట్ బాల్ క్రికెట్లో బెయిర్ స్టో ఆటతీరు అమోఘం అని కితాబునిచ్చాడు. 

రూట్... ఇప్పుడున్న ఫామ్ ప్రకారం చూస్తే పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్, టీమిండియా యువ ఆటగాడు శుభ్ మాన్ గిల్ పేరు చెబుతాడనుకుంటే... వయసు మీదపడుతున్న బెయిర్ స్టోను టాప్ స్కోరర్ గా పేర్కొనడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 

అత్యధిక వికెట్లు తీసే బౌలర్ ఎవరన్న అంశంలోనూ రూట్ అభిప్రాయం విస్మయం కలిగించేదిగా ఉంది. భారత్ లోని స్పిన్ పిచ్ లపై ఇంగ్లండ్ లెగ్ స్పినర్ అదిల్ రషీద్ వికెట్ల పండగ చేసుకుంటాడని తెలిపాడు. అదిల్ రషీద్ లో నైపుణ్యానికి కొదవలేదని రూట్ పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News