ఈ తోక చుక్క మళ్లీ 400 ఏళ్లకు కానీ కనిపించదు..!
- ఈ నెల 12న దర్శనమివ్వనున్న నిషిమురా తోకచుక్క
- సూర్యోదయానికి పూర్వం ఈశాన్య దిక్కున దర్శనం
- మంచి బైనాక్యులర్ సాయంతో చూడొచ్చంటున్న శాస్త్రవేత్తలు
నేరుగా కంటితో కాకుండా ఏదైనా పరికరం సాయంతో దీన్ని స్పష్టంగా చూడొచ్చు. ఆకాశంలో ఇది ఉన్న స్థానం దృష్టా నేరుగా కంటితో చూస్తే అస్పష్టంగా అనిపిస్తుంది. తెల్లవారుజాము సమయంలో, సూర్యోదయానికి అరగంట ముందు ఈశాన్య దిక్కున నింగివైపు చూస్తే ఈ తోక చుక్క కనిపిస్తుంది. సూర్యుడికి చేరువ అయ్యే కొద్దీ ఇది మరింత ప్రకాశవంతంగా మారుతుంది. కానీ, భూమి పైనున్న వారికి కనిపించదు. మంచి బైనాక్యులర్ సాయంతో కచ్చితమైన దిశలో చూస్తే ఇది కనిపిస్తుందని నాసా సెంటర్ ఫర్ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ స్టడీస్ మేనేజర్ పౌల్ చోడాస్ సూచించారు. సెప్టెంబర్ 17న సూర్యుడికి ఇది చేరువగా వెళుతుంది.