ramya: కన్నడ సినీ నటి, కాంగ్రెస్ నేత రమ్య మృతి చెందినట్లు పోస్టులు.. ఖండించిన కాంగ్రెస్ నేత

Divya Spandana is absolutely fine
షార్ట్స్‌లో చూడండి
కన్నడ సినీ నటి, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ దివ్య స్పందన (రమ్య) చనిపోయారంటూ వచ్చిన వార్తలను ఆ పార్టీకి చెందిన తమిళనాడు నేత, ఐటీ సెల్ చైర్మన్ లక్ష్మీకాంతన్ స్పందించారు. రమ్యపై వస్తున్నవన్నీ వదంతులేనని, అవన్నీ నూటికి నూరు శాతం తప్పుడు వార్తలని అన్నారు. ఆమె బాగానే ఉన్నారని స్పష్టం చేశారు. 

కన్నడ సినీ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన ఇటీవల కన్నుమూశారు. ఆమెను గుర్తు చేసుకుంటూ ఇటీవల విజయ్ ఓ పోస్ట్ పెట్టారు. దీంతో కొందరు నెటిజన్లు స్పందన హ్యాష్ ట్యాగ్‌తో సంతాపం తెలిపారు. ఇది చూసిన ఓ నెటిజన్... ఆ స్పందనే దివ్యస్పందనగా పొరబడి ఆమెను ట్యాగ్ చేస్తూ చనిపోయినట్లుగా పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.

ఈ క్రమంలో పలువురు జర్నలిస్ట్‌లు ఆమెతో మాట్లాడారు. ఆమె ఆరోగ్యంగానే ఉన్నట్లు వారు కూడా వెల్లడించారు. ప్రస్తుతం దివ్య జెనీవాలో ఉన్నారని, ఫోన్ చేసి మాట్లాడినట్లు పలువురు జర్నలిస్ట్‌లు తెలిపారు. బాధ్యతలేని వ్యక్తులు ఇలాంటి రూమర్స్ సృష్టించినట్లు పేర్కొన్నారు.
Go Back to Shorts
ramya
divya spandana
Congress
acress

More Telugu News