స్వీటీకి ఇష్టమైన వంటకం ఏంటో ఇన్నాళ్లకు తెలిసింది: ప్రభాస్
- విడుదలకు సిద్ధమైన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి
- ఇందులో చెఫ్ పాత్ర పోషించిన అనుష్క
- రెసిపీ చాలెంజ్ ప్రారంభించిన స్వీటీ
- ప్రభాస్ ను నామినేట్ చేసిన వైనం
- అనుష్క చాలెంజ్ స్వీకరిస్తున్నట్టు తెలిపిన ప్రభాస్
స్వీటీ (అనుష్క అసలు పేరు) తనకు చాలాకాలంగా తెలుసని, కానీ ఇప్పటిదాకా ఆమెకు ఇష్టమైన వంటకం ఏంటో తనకు తెలియదని ప్రభాస్ పేర్కొన్నారు. ఇప్పటికి తెలిసిందని వెల్లడించారు.
"ఫుడ్ రెసిపీ చాలెంజ్ ను నేను స్వీకరిస్తున్నా. నాకు ఇష్టమైన రొయ్యల పులావ్ రెసిపీని పంచుకుంటున్నాను. ఈ క్రమంలో నేను రామ్ చరణ్ ను ఈ చాలెంజ్ కు నామినేట్ చేస్తున్నాను. రామ్ చరణ్ తనకు ఇష్టమైన రెసిపీని పంచుకోవాలని, అనంతరం మరొకరిని నామినేట్ చేయాలని కోరుతున్నాను" అంటూ ఇన్ స్టాగ్రామ్ లో స్పందించారు. అభిమానులు కూడా తమకిష్టమైన రెసిపీలు తనతో పంచుకోవాలని ప్రభాస్ పిలుపునిచ్చారు.
"మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా సెప్టెంబరు 7న థియేటర్లలోకి వస్తోంది... అందరూ చూసి ఆనందించండి. ఈ సందర్భంగా చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను" అంటూ ప్రభాస్ తన పోస్టులో పేర్కొన్నారు.