తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. రూ.700 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్న దుబాయ్ సంస్థ
- కేటీఆర్‌తో నాఫ్కో సీఈవో ఖాలీద్ అల్ ఖతిబ్ బృందం భేటీ
- తెలంగాణలో అగ్నిమాపక సామగ్రి తయారు చేస్తామని వెల్లడి
- భారత్ డిమాండ్‌కు సరిపోయేలా తెలంగాణలో అగ్నిమాపక సామగ్రి తయారీ ప్లాంట్
తెలంగాణ సహా భారత్ విస్తృతంగా అభివృద్ధి చెందుతోన్న నేపథ్యంలో అగ్నిమాపక సామగ్రి, అగ్నిమాపక సేవల అవసరం భవిష్యత్తులో భారీగా పెరుగుతుందనే విశ్వాసం తమకు ఉందని నాఫ్కో పేర్కొంది. తెలంగాణలో ఏర్పాటు చేయబోయే అగ్నిమాపక సామగ్రి తయారీ ప్లాంట్ భారత్ డిమాండ్‌కు సరిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
అదే సమయంలో తెలంగాణలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్‌తో కలిసి అంతర్జాతీయ స్థాయి ఫైర్ సేఫ్టీ ట్రెయినింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలన్న కేటీఆర్ ప్రతిపాదనకు కంపెనీ అంగీకారం తెలిపింది. ఈ ట్రైనింగ్ అకాడమీ ద్వారా దాదాపు 100కు పైగా దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తోన్న తమ సంస్థ నైపుణ్యాన్ని, అగ్నిమాపక శిక్షణను తెలంగాణ కేంద్రంగా అందిస్తామని సంస్థ సీఈవో తెలిపారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాల్లో సేవలు అందిస్తోన్న నాఫ్కో తెలంగాణలో ఇన్వెస్ట్ చేయనున్నట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు.