Udayanidhi: ఉదయనిధిని అంతం చేస్తే రూ.కోటి నజరానా ఇస్తా: తెలంగాణ బీజేపీ నేత దిలీపాచారి

Will give 1 Cr to whoever removes Udayanidhi says BJP leader Dileepachari
  • సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న తమిళనాడు మంత్రి స్టాలిన్
  • ఉదయనిధి దేశద్రోహి అన్న దిలీపాచారి
  • ద్రావిడం, సంస్కృతం అంటూ విభేదాలు సృష్టిస్తున్నారని మండిపాటు

సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలను ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు, హిందూ సంఘాలు తప్పుపట్టాయి. తాజాగా తెలంగాణలోని నాగర్ కర్నూల్ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జీ దిలీపాచారి మాట్లాడుతూ... ఉదయనిధి దేశద్రోహి అని మండిపడ్డారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న ఉదయనిధిని నిర్మూలించిన వారికి కోటి రూపాయల నజరానా ఇస్తానని ప్రకటించారు. సామాజిక న్యాయానికి, సమానత్వానికి సనాతన ధర్మం ప్రతీక అని చెప్పారు. 

దేశ ప్రజల మధ్య ఐకమత్యం కోసం బీజేపీ తాపత్రయ పడుతోందని... ద్రావిడం, సంస్కృతం అంటూ ప్రజల మధ్య విభేదాలను సృష్టించి, దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ఉదయనిధి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. హిందువులంతా ఇప్పటికైనా ఏకతాటిపైకి వచ్చి సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేవారిని క్షమించకూడదని చెప్పారు.

  • Loading...

More Telugu News