Khushi: మూడు రోజుల్లో రూ.70 కోట్లు రాబట్టిన 'ఖుషి'

Khushi collects Rs 70 cr gross in 3 days
  • విజయ్ దేవరకొండ, సమంత జంటగా ఖుషి
  • శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మాణం
  • సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం
  • తొలిరోజే రూ.30 కోట్ల గ్రాస్
  • చిత్రబృందంలో ఉత్సాహం 
విజయ్ దేవరకొండ, సమంత జంటగా తెరకెక్కిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టయిన్ మూవీ ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపుదిద్దుకున్న ఈ చిత్రం సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమెరికాలో ప్రీమియర్స్ నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న ఖుషి... ఏపీ, తెలంగాణలోనూ విశేషంగా ప్రేక్షకాదరణ పొందుతోంది. 

తొలి రెండ్రోజుల్లోనే రూ.50 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ చిత్రం... మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ రూ70.23 కోట్లు వసూలు చేసింది. కాగా, ఈ చిత్రానికి బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.53.5 కోట్లు.  ఖుషి తొలిరోజే రూ.30 కోట్లు వసూలు చేయడంతో చిత్రబృందంలో ఉత్సాహం నెలకొంది. తమ చిత్రం బ్లాక్ బస్టర్ అని మైత్రీ మూవీ మేకర్స్ పేర్కొంది.
Khushi
Collections
Gross
Vijay Devarakonda
Samantha
Siva Nirvana
Mythri Movie Makers

More Telugu News