Team India: టీమిండియాను వెంటాడుతున్న వరుణుడు... వర్షం వల్ల నేపాల్ తో మ్యాచ్ నిలిపివేత

Rain halts play between Team India and Nepal in Asia Cup Group A match
  • ఆసియా కప్ లో నేడు భారత్, నేపాల్ ఢీ
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
  • 37.5 ఓవర్ల వద్ద వర్షం 
  • అప్పటికి 6 వికెట్లకు 178 పరుగులు చేసిన నేపాల్
  • 3 వికెట్లతో నేపాల్ ను దెబ్బతీసిన జడేజా
ఆసియా కప్ లో టీమిండియాను వరుణుడు వదలడంలేదు. మొన్న పాకిస్థాన్ తో భారత్ మ్యాచ్ ను కబళించిన వాన... ఇవాళ నేపాల్ తో మ్యాచ్ లోనూ ప్రత్యక్షమైంది. భారీ వర్షం కురుస్తుండడంతో మైదానం మొత్తం కవర్లతో కప్పివేశారు. 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా, నేపాల్ బ్యాటింగ్ కు దిగింది. ఈ మ్యాచ్ కు శ్రీలంకలోని పల్లెకెలె మైదానం వేదిక. నేపాల్ 37.5 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగుల చేసిన దశలో వర్షం రావడంతో మ్యాచ్ ఆగిపోయింది. క్రీజులో నేపాల్ బ్యాట్స్ మెన్ దీపేంద్ర సింగ్ ఐరీ (27 బ్యాటింగ్), సోంపాల్ కామీ (11 బ్యాటింగ్) ఉన్నారు. టీమిండియా బౌలర్లలో లెఫ్టార్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజా 3 వికెట్లు తీయడం విశేషం. సిరాజ్ కు 2, శార్దూల్ ఠాకూర్ కు 1 వికెట్ దక్కాయి. 

ఈ మ్యాచ్ లో నేపాల్ కు శుభారంభం లభించింది. ఓపెనర్లు ఆసిఫ్ షేక్ (58), కుశాల్ భుర్టెల్ (38) తొలి వికెట్ కు 65 పరుగులు జోడించారు. కుశాల్ ను శార్దూల్ ఠాకూర్ అవుట్ చేయడంతో ఈ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. మిడిల్ లో జడేజా విజృంభించడంతో నేపాల్ వడివడిగా వికెట్లు చేజార్చుకుంది. అయితే, దీపేంద్ర సింగ్, సోంపాల్ వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశారు. గుల్షన్ జా 23 పరుగులు చేశాడు.
Team India
Nepal
Rain
Pallekele
Sri Lanka
Asia Cup

More Telugu News