11వ తేదీ వరకు పలు రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే.. రూట్లు ఇవే!
- సికింద్రాబాద్ డివిజన్లో రైల్వే లైన్ల మరమ్మతులు, నిర్వహణ పనులు
- ఈ రోజు నుంచి పలు రైళ్లను రద్దు చేసినట్టు అధికారుల ప్రకటన
- విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోనూ కొన్ని రైళ్ల రద్దు
కాజీపేట్-డోర్నకల్, డోర్నకల్- విజయవాడ, భద్రాచలంరోడ్-విజయవాడ, కాజీపేట్-సిర్పూర్ టౌన్, బలార్షా-కాజీపేట్ రైళ్లు 5 నుంచి 11వ తేదీ వరకు రద్దయ్యాయి. సిర్పూర్ టౌన్-భద్రాచలం రోడ్ , సికింద్రాబాద్-వరంగల్, సిర్పూర్ టౌన్-కరీంనగర్ రైళ్లను 5 నుంచి 11 వరకు రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. భద్రాచలం రోడ్-బలార్షా రైలు 10 వరకు రద్దయింది. కరీంనగర్-నిజామాబాద్, కాజీపేట్-బలార్షా రైళ్లు కూడా 10వ తేదీ వరకు రద్దు చేశారు. వీటితో పాటు విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో కూడా పలు రైళ్లను అధికారులు రద్దు చేసినట్టు అధికారులు ప్రకటించారు.