Sonia Gandhi: సోనియాగాంధీకి అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక

Congress Leader Sonia Gandhi Admitted To Sir Ganga Ram Hospital
  • స్వల్ప జ్వరంతో సర్ గంగారాం ఆసుపత్రిలో చేరిక
  • పర్యవేక్షిస్తున్న వైద్య బృందం
  • ఈ ఏడాది జనవరిలో ఒకసారి, మార్చిలో మరోసారి అదే ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ నేత
  • ఆరోగ్యం నిలకడగానే ఉందన్న వైద్యులు
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియగాంధీ ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. స్వల్ప జ్వరంతో బాధపడుతున్న ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ ఏడాదిలో సోనియా ఇప్పటికే రెండుసార్లు ఇదే ఆసుపత్రిలో చేరారు. వైరల్ శ్వాసకోస ఇన్ఫెక్షన్‌తో ఈ ఏడాది జనవరి 12న ఆసుపత్రిలో చేరారు. ఐదు రోజుల తర్వాత 17న ఆసుప్రతి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 

ఆ తర్వాత మార్చి 2న జ్వరంతో అదే ఆసుపత్రిలో సోనియా చేరారు. ఆ తర్వాత కోలుకున్న ఆమె పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆగస్టు 31న ముంబైలో నిర్వహించిన ఇండియా కూటమి సమావేశంలో కుమారుడు రాహుల్ గాంధీతో కలిసి పాల్గొన్నారు. అంతలోనే ఆమె మళ్లీ ఆసుపత్రిలో చేరడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.
Sonia Gandhi
Congress
Sir Ganga Ram Hospital

More Telugu News