Team India: పాక్ పై భారీ స్కోరు కొడతారనుకుంటే... 266కి ఆలౌటైన టీమిండియా

Team India all out for 266 runs against Pakistan in Asia Cup
  • ఆసియా కప్ లో నేడు దాయాదుల సమరం
  • పాక్ పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
  • 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌట్
  • పాండ్యా 87, ఇషాన్ కిషన్ 82 పరుగులతో రాణించిన వైనం

ఆసియా కప్ గ్రూప్-ఏ లీగ్ పోటీల్లో భాగంగా నేడు భారత్, పాకిస్థాన్ తలపడుతున్నాయి. శ్రీలంకలోని పల్లెకెలె మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌట్ అయింది. 

ఇషాన్ కిషన్ (82), హార్దిక్ పాండ్యా (87) క్రీజులో ఉన్నంత సేపు టీమిండియా స్కోరు 300 దాటడం ఖాయం అనిపించింది. ఇషాన్ కిషన్ అవుటయ్యాక పాండ్యా కాసేపు దూకుడుగా ఆడినా, షహీన్ అఫ్రిది ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి భారత్ భారీ స్కోరు ఆశలకు కళ్లెం వేశాడు. ఎంతో కీలకమైన హార్దిక్ పాండ్యా, జడేజాలను పెవిలియన్ కు తిప్పి పంపాడు. 

చివర్లో నసీమ్ షా ఒకే ఓవర్లో 2 వికెట్లు తీయడంతో టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది. ఆఖర్లో జస్ప్రీత్ బుమ్రా 14 బంతుల్లో 3 ఫోర్లతో 16 పరుగులు సాధించాడు. పాక్ బౌలర్లలో షహీన్ అఫ్రిది 4, నసీమ్ షా 3, హరీస్ రవూఫ్ 3 వికెట్లు తీశారు.

  • Loading...

More Telugu News