Gudivada: గుడివాడ పాఠశాలలో దారుణం.. విద్యార్థులతో మూత్రశాల కడిగించిన వైనం

Head mistress of Gudivada school cleaned toilets with students
  • గుడివాడ ఎస్పీఎస్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో దారుణం
  • పిల్లల చేత పనులు చేయిస్తున్న ప్రధానోపాధ్యురాలు
  • ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న తల్లిదండ్రులు

కృష్ణా జిల్లా గుడివాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ప్రధానోపాధ్యాయురాలు వారితో పాఠశాలలోని మూత్రశాలలను కడిగించారు. ఎస్పీఎస్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాఠశాలలో చదివే విద్యార్థులతో ఆమె అన్ని పనులూ చేయిస్తున్నారు. వంట సిబ్బంది రాని సమయంలో కూడా వండిన పాత్రలను పిల్లలే తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కొందరు పిల్లలు వడ్డిస్తుంటే, మరికొందరు భోజనం చేసే పరిస్థితి అక్కడ నెలకొంది. ఈ క్రమంలో ప్రధానోపాధ్యాయురాలిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పిల్లల చేత పనులు చేయిస్తున్న ఆమెపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News