HICC: హెచ్ఐసీసీకి సీఎం కేసీఆర్... నేడు హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

Traffic restrictions in the surrounding areas of hi tech city today
  • నేడు స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు సభ 
  • హాజరుకానున్న సీఎం కేసీఆర్, మంత్రులు, అధికారులు
  • ఆ ప్రాంతంలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయన్న పోలీసులు
ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా ఈ రోజు హెచ్ఐసీసీలో నిర్వహించే స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు సభ జరగనుంది. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్, మంత్రులు, అధికారులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా హెచ్ఐసీసీ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర పోలీసులు తెలిపారు. ఉదయం 7 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు. వీవీఐపీలు రానుండటంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉందన్నారు. 

జేఎన్టీయూ నుంచి సైబర్ టవర్స్ వైపునకు, మియాపూర్ నుంచి కొత్తగూడ వైపునకు, కావూరిహిల్స్ నుంచి సైబర్ టవర్స్ వరకు, నారాయణమ్మ కాలేజ్ నుంచి గచ్చిబౌలి వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మార్గంలో భారీ వాహనాలకు అనుమతులు లేవని తెలిపారు. అవసరాన్ని బట్టి వాహనాలను నిలిపేయడంగానీ, దారి మళ్లించడం గానీ చేస్తామన్నారు. వాహనదారులు ఆంక్షలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని పోలీసులు సూచించారు.
HICC
CM KCR
hi tech city
Traffic
Hyderabad

More Telugu News