ISRO: రేపే ఆదిత్య ఎల్-1 ప్రయోగం.. మిషన్ సక్సెస్ కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఇస్రో ఛైర్మన్

ISRO chairmen offers prayers for success of Aditya L1 mission

  • రేపు 11.50 గంటలకు ఆదిత్య ఎల్-1 ప్రయోగం
  • నింగిలోకి మోసుకెళ్లనున్న పీఎస్ఎల్వీ సీ-57
  • సూర్యుడి రహస్యాలను శోధించడమే మిషన్ లక్ష్యం

చంద్రయాన్-3 విజయంతో చరిత్ర సృష్టించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఇప్పుడు మరో భారీ మిషన్ కు సన్నద్ధమయింది. సూర్యుడి రహస్యాలను శోధించేందుకు రెడీ అయింది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఆదిత్య ఎల్-1 ప్రయోగాన్ని చేపట్టబోతోంది. రేపు ఉదయం 11.50 గంటలకు శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ సీ-57 రాకెట్ ద్వారా ఆదిత్య ఎల్-1ను నింగిలోకి పంపనుంది. ఈ ఉదయం 11.30 గంటలకు పీఎస్ఎల్వీ సీ-57 రాకెట్ కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. రేపు భారీ ప్రయోగాన్ని చేపట్టనున్న నేపథ్యంలో సూళ్లూరుపేటలోని శ్రీచెంగాలమ్మ అమ్మవారి ఆలయంలో ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ఆయన పూజలు చేశారు.

ISRO
Aditya L1
Sun
Launch
  • Loading...

More Telugu News