India: భారత్‌కు మద్దతుగా మరో నాలుగు దేశాలు.. చైనా కొత్త జాతీయ మ్యాప్‌పై గుస్సా

After India Philippines Malaysia Vietnam and Taiwan reject Chinas new map pcs spl
  • తన ప్రామాణిక మ్యాపులో పొరుగు దేశాల భూభాగాలు చేర్చిన చైనా
  • చైనా తీరును ఖండిస్తూ ఇటీవల భారత్ ఆగ్రహం
  • భారత్‌తో తాజాగా గొంతు కలిపిన మరో నాలుగు దేశాలు
  • చైనా తీరును ఖండిస్తూ ఫిలిప్పీన్స్, మలేషియా, వియత్నాం, తైవాన్ దేశాలు ప్రకటనల జారీ
పొరుగు దేశాల ప్రాంతాలను తమవిగా చెప్పుకొంటూ చైనా ఇటీవల విడుదల చేసిన జాతీయ ప్రామాణిక  మ్యాప్‌పై ఆయా దేశాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఈ మ్యాప్‌పై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తాజాగా ఫిలిప్పీన్స్, మలేషియా, వియత్నాం, తైవాన్ దేశాలు కూడా చైనాకు వ్యతిరేకంగా భారత్‌తో గొంతు కలిపాయి. చైనా మ్యాపును ఖండిస్తూ ఘాటు విమర్శలతో అధికారిక ప్రకటనలు విడుదల చేశాయి. 

ఆగస్టు 28న చైనా తన కొత్త ‘ప్రామాణిక’ మ్యాపును విడుదల చేసింది. గతంలో సరిహద్దుల విషయంలో తప్పులు దొర్లిన ‘సమస్యాత్మక’ మ్యాపులను సిరిదిద్ది ఈ తాజా మ్యాప్‌ను విడుదల చేసినట్టు చైనా ప్రకటించింది. భారత భూభాగాలైన అరుణాచల్ ప్రదేశ్, అక్సాయి చిన్‌ను తన మ్యాపులో చైనా ప్రాంతాలుగా చూపెట్టుకుంది. 

దీనిపై భారత్ మంగళవారం తీవ్ర విమర్శలు చేసింది. సరిహద్దు వివాదాన్ని ఈ మ్యాపు మరింత సంక్లిష్టంగా మారుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘అర్థరహిత ప్రతిపాదనలు చేసినంత మాత్రాన ఇతరుల భూభాగాలు మీవైపోవు’’ అని భారత్ విదేశాంగ శాఖ మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

చైనా మ్యాపుపై ఫిలిప్పీన్స్ తాజాగా మండిపడింది. దక్షిణ ఫిలిప్పీన్స్ సముద్ర ప్రాంతంలో తమ ప్రాంతాలను చైనాలో భాగంగా చూపించారని మండిపడింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఇలాంటి ప్రయత్నాలు చెల్లుబాటుకావని తేల్చి చెప్పింది. చైనాకు అధికారికంగా తమ నిరసనను తెలియజేస్తామని మలేషియా పేర్కొంది. చైనా మరోసారి రెచ్చగొట్టుడు చర్యలకు దిగిందని వియత్నాం ప్రభుత్వం విమర్శించింది. చైనా తీరును తీవ్రంగా ఖండించిన తైవాన్ తాము ఎన్నడూ చైనా పాలనలో లేమని తేల్చి చెప్పింది. అయితే, తాము వెనక్కు తగ్గేదే లేదని చైనా తేల్చి చెప్పింది.
India
China
Philippines
Malaysia
Taiwan
Vietnam

More Telugu News