Arrest: యువతి స్నానం చేస్తుండగా వీడియో తీసే యత్నం.. కటకటాల వెనక్కి నిందితుడు

Man Arrested for shooting video while young girl bathing
  • హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్‌లో ఘటన
  • యువతి కేకలు వేయడంతో పరారైన నిందితుడు
  • హాస్టల్‌లోకి పారిపోయిన నిందితుడిని పట్టుకున్న పోలీసులు
యువతి స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీసిన యువకుడిని పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్‌లో జరిగిందీ ఘటన. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా నివసించే యువతి (22) బుధవారం రాత్రి తన ఇంట్లోని బాత్రూంలో స్నానం చేస్తుండగా, వెంటిలేటర్ నుంచి ఓ యువకుడు వీడియో తీస్తుండడం చూసి గట్టిగా కేకలు వేసింది.

ఆమె కేకలతో భయపడిన యువకుడు వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి కేకలు విని చుట్టుపక్కల వారు రావడంతో విషయం చెప్పింది. వారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాపూనగర్‌లోని ఓ హాస్టల్‌లో దాక్కున్న నిందితుడు ప్రశాంత్‌ను అరెస్ట్ చేశారు.
Arrest
Hyderabad
SR Nagar

More Telugu News