Jagan: విదేశాలకు వెళ్లేందుకు జగన్, విజయసాయి రెడ్డిలకు కోర్టు అనుమతి.. ఏయే దేశాలకు వెళ్తున్నారంటే..?

CBI Court gives permission to Jagan and Vijayasai Reddy to go to abroad
  • కూతుళ్లను చూసేందుకు లండన్ వెళ్తున్న జగన్
  • సెప్టెంబర్ 2 నుంచి 12వ తేదీ వరకు కోర్టు అనుమతి
  • విజయసాయిరెడ్డికి నెల రోజుల పాటు అనుమతి
ఫారిన్ టూర్ కు వెళ్లేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిలకు సీబీఐ కోర్టు అనుమతిని మంజూరు చేసింది. లండన్ లో ఉన్న తన కూతుళ్లను చూసేందుకు వెళ్లేందుకు అనుమతిని ఇవ్వాలని జగన్ కోర్టు అనుమతిని కోరారు. దీంతో సెప్టెంబర్ 2 నుంచి 12వ తేదీ వరకు ఆయన వెళ్లేందుకు కోర్టు అనుమతించింది. తన భార్య భారతితో కలిసి లండన్ కు జగన్ వెళ్లనున్నారు.

మరోవైపు నెల రోజుల పాటు విదేశాలకు వెళ్లేందుకు విజయసాయికి కోర్టు అనుమతి ఇచ్చింది. యూకే, యూఎస్ఏ, జర్మనీ, దుబాయ్, సింగపూర్ దేశాల్లో విజయసాయి పర్యటించనున్నారు. యూనివర్శిటీలతో ఒప్పందాల కోసం తాను విదేశాలకు వెళ్తున్నట్టు కోర్టుకు విజయసాయి తెలిపారు.
Jagan
Vijayasai Reddy
YSRCP
CBI Court

More Telugu News