Junior NTR: జూనియర్ ఎన్టీఆర్ బావమరిది చిత్రం 'మ్యాడ్' టీజర్ విడుదల

Junior NTR brother in law Narne Nithin movie MAD trailer released
  • నార్నే నితిన్ నటించిన చిత్రం 'మ్యాడ్'
  • ఇంజినీరింగ్ కాలేజీ నేపథ్యంలో సినిమా
  • సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న త్రివిక్రమ్ భార్య సౌజన్య
జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ నటుడిగా పరిచయం అవుతున్న 'మ్యాడ్' సినిమా ట్రైలర్ ఈరోజు విడుదలయింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన కల్యాణ్ శంకర్ కు కూడా ఇదే మొదటి సినిమా. ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ కుమార్తె సూర్యదేవర హారిక ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నిర్మాతగా ఆమెకు కూడా ఇదే తొలి చిత్రం కావడం గమనార్హం. హారికతో పాటు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య సౌజన్య ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 

'మ్యాడ్' సినిమా ఇంజినీరింగ్ కాలేజీ నేపథ్యంలో తీశారు. ఈ చిత్రంలో నార్నే నితిన్ తో పాటు రామ్ నితిత్, సంగీత్ శోభన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, గోపికా ఉద్యన్, అననతిక సునీల్ కుమార్ లు నటించారు. సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది. 


Junior NTR
Brother in law
Narne Nithin
Mad Movie

More Telugu News