Mallu Bhatti Vikramarka: ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ప్రకారమే సీట్ల కేటాయింపు: భట్టి విక్రమార్క

bhatti vikramarka who predicted the telangana election results
  • రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 74 నుంచి 78 సీట్లు వస్తాయన్న భట్టి
  • వచ్చే ఎన్నికల్లో బంపర్ మెజార్టీ ఖాయమని ధీమా
  • ఆచరణకు సాధ్యంకాని హామీలను తమ పార్టీ ఇవ్వదని వెల్లడి
సీట్ల కేటాయింపు విషయంలో కాంగ్రెస్ పార్టీలో వివాదం నెలకొంది. కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసేందుకు భార్యాభర్తలు, తండ్రీ కొడుకులు, తల్లీకొడుకులు పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ప్రకారమే సీట్ల కేటాయింపు ఉంటుందని చెప్పారు. 

గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 74 నుంచి 78 సీట్లు వస్తాయని చెప్పారు. బంపర్ మెజారిటీతో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆచరణకు సాధ్యంకాని హామీలను కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ ఇవ్వదని తెలిపారు. మాట ఇచ్చిందంటే తప్ప నెరవేరుస్తుందని అన్నారు.
Mallu Bhatti Vikramarka
Congress
telangana election results
Udaipur Declaration

More Telugu News