South Africa: బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం.. దక్షిణాఫ్రికాలో 52 మంది సజీవ దహనం

52 killed in massive building fire in South Africa
  • జొహన్నెస్‌బర్గ్‌లో ఘటన
  • మరో 43 మందికి గాయాలు
  • కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో ఓ బహుళ అంతస్తుల నివాస భవనంలో మంటలు చెలరేగి 52 మంది మరణించారు. మరో 43 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ రోజు తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, ఇప్పటి వరకు 52 మృతదేహాలను వెలికి తీసినట్టు అధికారులు పేర్కొన్నారు. 

ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అది తాత్కాలిక నివాసమని, ఎలాంటి లీజ్ అగ్రిమెంట్ లేకుండా ఇక్కడ ప్రజలు నివసిస్తున్నట్టు ఎవర్జెన్సీ సర్వీస్ అధికారులు తెలిపారు. ఆ భవనంలో కనీసం 200 మంది నివసిస్తున్నట్టు తెలిపారు.
South Africa
Johannesburg
Fire Accident

More Telugu News